అంశం: లోక రీతి
తేదీ :15-04-2019
శీర్షిక : అయినా మారని సగటు మనిషి
సంఖ్య -159
లోకో భిన్న రుచి .....
నష్టాలెన్నొచ్చినా మళ్ళీ మళ్ళీ
పంటలకై ప్రయత్నిస్తూంటారు..... రైతులు
కష్టాలెన్ని ఎదురైనా
ఉత్పత్తి కై పాటు పడుతుంటారు జీవితాంతం ... శ్రామికులు
కుటుంబాలనే ఫణంగా పెట్టి
జీవిత పందేరం కాస్తుంటారు..... సైనికులు
అనాథలను అక్కున చేర్చుకుంటాం
మీ వంతు సాయమందించమంటూ
నెత్తి నోరు చేసుకుంటారు .... స్వచ్చంద సంస్థలు
పావలా ఆకు కూరకు పది సార్లు బేరమాడి
మోతెబరు వస్తువు ఎమ్ ఆర్ పి అనగానే మాట్లాడం ...
డైమండ్ CD సైతం రూ 46000/- లంటూ
లలితంగా చెబితే కానీ బోధపడలేదు లోకానికి..... కొనుగోలుదార్లు
ప్రజల పన్నుల సొమ్ములే జీతాలుగా
ప్రజల కొరకు పని చేయాల్సిన
పని తెలియని కొంతమంది ప్రభుత్వో ద్యుగులు
పదే పదే లంచాలఆశించగానే .....
పని అయిపోతే చాలంటూ .....
పందేరంగా ఇచ్చేస్తుంటాం ..... ఆమ్ ఆద్మీ
తీరు మారిందని తీరుబడిగా రోదిస్తాం.....
కానీ మార్పు మనతోనే ముడిబడి ఉందని గుర్తించం....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment