అంశం: భూమి పుత్రుల పాద యాత్రలు
తేదీ : 07-01-2019
శీర్షిక: బువ్వ పెట్టే పాద ముద్రలు
సంఖ్య : 116
అనాదిగా భూమిని నమ్ముకున్నోళ్లు
అందరికి బువ్వ పెట్టేటోళ్లు
స్వార్థమెరుగని సరంగులు
సహనశీలతే చిరునామాలు
కటిక పేదరికపు కర్మాగారాలు
కన్నీటి సరస్సుల బంధు మిత్రులు
కష్టాల కొలిమి ప్రియ చుట్టాలు
పచ్చ తివాచీల నేతగాళ్ళు
పతనపు అంచున పయనించేటోళ్లు
బక్క చిక్కి శల్యమైనా
బతుకు జట్కా లాగుతున్నోళ్లు
మోడు వారిన జీవితాలలో
మొగ్గ తొడుగుకై మొర బెట్టుకొను
భూమి పుత్రులు రోడ్డెక్కుతున్నారు ......
పాద యాత్రలు కావవి
బువ్వ పాదముద్రలు ....
అవును మరి !
అక్కర తీర్చే నాయకులు కావాలి
రైతే రాజన్న నానుడిని
అక్షరాలా అమలు చేసే
అలసత్వం లేని అధికార్లు కావాలి .....
నిగ్గు తేల్చే భూపరీక్షలు కావాలి .....
నిర్ణీత పంటల వివరాలు అందివ్వాలి .....
అందుబాటులో ఎరువులు ఉంచాలి .....
అక్కరపూర్తి విత్తనాలివ్వాలి .....
అవసరమయ్యే గిడ్డంగులు .........
ఆపేక్ష లేని గిట్టుబాటు ధరలు చెల్లించాలి.....
జాలితో కాదు జాగరూకత పాటించాలి
జన్మనిచ్చి రైతును జాగృతపరచాలి.......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment