Thursday, April 18, 2019

కాలు కాలిన పిల్లులు

అంశం : కాలు కాలిన పిల్లులు 
తేదీ : 24-01-2019
శీర్షిక : గమ్యం  లేని  గమనం 
సంఖ్య : 129

మస్తిష్కమంతా  స్వార్థాలు 
మసకబారుతున్న మమతలు 
భరించలేనంత భారం 
బంధాలు, ప్రేమలు 
స్వార్థపూరితాలైన  
కలికాలపు సాక్షీ భూతాలు 
పట్టుకోమంటే కప్పకి 
వదిలివేయమంటే పాముకు 
వల్లమాలిన కోప తాపాలు 
పట్టువిడుపులున్న ప్రబుద్దుల పరిస్తితేమో
కాలు గాలిన పిల్లి చందం .... 
ఎదుటి వారి స్వార్థాలకు 
ఎప్పుడు బలి అవుతామో 
అని ప్రతి క్షణం .... నరక యాతన 

గట్టుకు చేర్చాల్సిన నావ 
నట్టేట ముంచే పరిస్థితి 
చుట్టూ అందరున్నా 
అశనిపాతపు సంద్రమే..... 
కలిసి బ్రతికే ఉదాహరణగా 
కాకితో కబురంపుదామన్న 
కలిసి రాని  వైనం 
కాలుగాలిన పిల్లిలా కదిలినా 
కనుచూపు మేరలో 
కావాల్సిన సాయమే కరువు..... 

అనుమానపు నీలి నీడలు 
అరమరికలు కూడళ్లు 
గమనం అగమ్య గోచరం 
ఏ దారి ఎటు పోతుందో 
కాలు గాలిన పిల్లిలా 
గాలిలో చక్కర్లు కోట్టినా .... 
రవంతైనా సాయమందని రోజులు. 

నగునూరి రాజన్న  

No comments:

Post a Comment