Thursday, April 18, 2019

గణతంత్ర దినోత్సవం

అంశం : గణతంత్ర దినోత్సవం 
26-01-2019
శీర్షిక : ఘన చరిత 
సంఖ్య: 131

రంగు రంగుల జండాల నీడన 
రగిలిన మన భారతముంది 
ఆనందాల వెల్లువల వెనక 
అమరుల రక్త చరిత్ర ఉంది 

చింతలేని జీవితాల దాపున 
చీకట్లో కలిసిన జీవితాలెన్నో?
చిరునవ్వుల తెరల వెనుక 
వీరుల పోరాటలెన్నో?

సాధించిన స్వాతంత్రానికి 
సార్ధకత మన రాజ్యాంగం 
సరంగుల గమనానికి 
సాధికార మార్గదర్శిని 

అవగాహన లేమితో 
అక్కడక్కడ  కారినట్టు తోచినా 
చెక్కు చెదరనిది మన లిఖిత రాజ్యాంగం     
దెబ్బదేండ్ల ఘనచరిత

చిన్న చిన్న పొర పొచ్చాలతో 
అల్పులు అప్పుడప్పుడు కెలికినా ......  
లెక్క లేనన్ని కుల మతాలను 
ఒక్కటిగానిలిపిన ఘనత 

మూడు వందల తొంబై ఐదు ప్రకారణాల   
లిఖిత రాజ్యాంగ మహామహులకు  నా సలాం 
వారసత్వ సంపద ముదముతో 
ముందు తరాలకు అందిద్దాం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment