అంశం : సేవా నిరతి
తేదీ : 26 - 12 -2018
శీర్షిక : స్వార్థమెరుగని ప్రతి సందర్భం...
కష్టానికి తగ్గ ప్రతిఫలం కానరాక
కలకాలం జనులకు కడుపు నింప
కడదాకా ప్రయతించే కర్షకుడిది
కాదనలేని కమనీయపు సేవే కదా !
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు
కంటినిండా దేశ ప్రజలు చలువ కునుకు తీయ
కఠిన వాతావరణ కాలాల సైతం
కటీక నేలలే కమల పాన్పులుగా చేసుకునే
జవానుల కవాతు కాదనలేని సేవానిరతి...!
అమ్మ నాన్నలంతా ఆనందాలు వదులుకుని
అంతా తమ పిల్లలే తమ భవిష్యత్ అనుకుని
ప్రతిక్షణం పరితపించి ప్రాణప్రదమై
స్వంత కాళ్లపై నిలిచేదాకా మలిచే ప్రతి అడుగు
పవిత్రమైన సేవే కదా !
అనంతమైన ప్రకృతి సంపదలన్నీ
అప్పనంగా మనకిస్తున్న
అచ్ఛమైన పర్యావరణ ఫలాలు
స్వార్థమెరుగని ప్రతి సందర్భం....
సంకేతమే కదా సేవ నిరతికి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment