Thursday, April 18, 2019

క్రాంతి

నగునూరి రాజన్న
అంశం :  క్రాంతి
తేదీ : 15-01-2019
శీర్షిక : క్రాంతి .....సంక్రాంతి
సంఖ్య : 123

అవని దూత ఆరోగ్య ప్రదాత
అరుణారుణ కాంతుల దినకరుని
ఆయనం మార్పును ఆగామిస్తూ
అంగణులంతా రంగవల్లులను తీర్చి దిద్ద
అరుదెంచదా అందమైన క్రాంతి ......
ఆనందాల సంక్రాంతి.

ఎదురు చూసే పల్లె  ఎదలు 
సిరి మల్లెయై నవ్వె చూడు
ఆధ్యాత్మికతను స్పర్శించే
సంకీర్తనల హరిదాసులు
రంగు రంగుల పట్టు బట్టల
బసవన్నలు తిరుగాడే  సందళ్ళు
పల్లె చేరదా ....... క్రాంతి
పసందైన సంక్రాంతి.

గీతలో ప్రవచించినదే
అన్నీ తానై మసిలినా
అంటి ముట్టనట్టు ఉండాలి.
కాల గమన మహిమలలో 
ఉరగము ఉనికి మార్చుకున్నట్టు
కామ క్రోధ మద మాత్సర్యములను
తాత్సారము చేయకుండ మార్చుకుంటే..... 
మానవత్వం సంతరించుకుంటే..... 
చేరదా.. సంఘ జీవనాన .... క్రాంతి.
సరికొత్త సరదాల ..... సంక్రాంతి.

నగునూరి రాజన్న   

No comments:

Post a Comment