Thursday, April 18, 2019

దృష్టి కోణం

అంశం : దృష్టి కోణం 
తేదీ :19-01-2019
శీర్షిక :  127

సర్వేంద్రియాణాం 
నయనం ప్రధానం 
చూసిన ప్రతీది 
కనుపాపలో ప్రసరించి 
చిత్ర నిర్మితమై 
తెరపై ప్రతిబింబించి 
నాడీ సంకేతమై 
భావ నిశ్చయమై 
భాషగా రూపొంది 
మాటగా బహిర్గతమౌతుంది . 

ప్రతి వస్తువుకు 
రంగు, రుచి, వాసన, రూపం , పరిమాణం 
వివరం ఇత్యాది ఆవశ్యం 

దృష్టి కోణం అంతా ఏకమే అవుతే 
అంతా సాధారణమే ..... 
మారినప్పుడే అనుకూలాలు, ప్రతికూలాలు .... 
పుర్రెకో గుణం జిహ్వకో రుచి.... 
ఏ  ఇద్దరి ఆలోచనలు, భావాలు 
ఒకే వస్తువు చూసినా,  ఒకేలాగా ఆలోచించరు . 
ఒకే విషయం చదివినా ,  ఒకేలాగా   అర్థం చేసుకోరు 
ఒకే విషయం విన్నా  ఒకేలాగా ఆలోచించరు . 
ఒకే విషయం చెప్పినా , తిరిగి ఒకేలాగా చెప్పలేరు. 
మనుషులు మారారు కాబాట్టి  వేర్వేరు విధాలుగా.... 

ఏమి చేసినా, ఎవరు చేసినా.... 
ధనావర్తనమైతే అంతా సవ్యమే... శ్రీకారానికి నాంది...... 
ఋణావర్తనమైతేనే  పెద్ద చిక్కు ... వినాశనానికి బీజం..... 

ఏది ఏమైనా 
యద్భావం  తద్భవేత్ ... 
ప్రశాంతత, ప్రసన్నత 
సానుకూలత, సత్సంగం 
మంచి ద్రుష్టి కోణానికి దారి వేస్తుంది. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment