Thursday, April 18, 2019

పొరుగింటి కూర

అంశం : పొరుగింటి కూర 
తేదీ : 05 -02 -2019 
శీర్షిక : ఆశ అత్యాశ 
సంఖ్య: 138 

కలి మాయల ఒడిలో సెద దీరె 
నిలకడ నేర్వని మానవాళికి 
ఆశ, అత్యాశ,దురాశల గుర్రాలనెక్కి ఊరేగి 
ఆకాశపుటంచుల అందాలను సైతం
అందుకుని ఊయలలూగాలని.... 

మరులుగొన్న మరమనుషులు 
మాయ డాలర్ల మోజుల్లో
పరాయి భాషకు కిరాయి మనుషులై
మాతృ భాష మహాత్యాన్ని మరిచి 
ఆశల దాసోహం అంటున్నారు ..... 

అహోరాత్రులు అల్లర్లకు
ఆజ్యం పోస్తూ కల్లోల కాశ్మీరం చేసి 
ఆటంకవాదానికి అడ్డాగా మార్చి 
అతలాకుతలం గావిస్తున్న 
పాకిస్తానీ పొరుగింటి కూర ఆశలకు....  

అందరు బాగుండాలి 
అందున నేనుండాలి 
అనుకునే మన దేశ సిద్ధాంతపు 
వీర జవాన్లు 
వీసమంత అవకాశమీయక 
అహోరాత్రులు పహారా కాస్తూ 
అడుగడుగున అడ్డుగ నిలుస్తున్నరు.... 

పదే పదే పరాభవమయినా పాకిస్థానీలు
అదే పనిగ కాలు దవ్వుతూనే ఉన్నారు.... 


నగునూరి రాజన్న

No comments:

Post a Comment