Thursday, April 18, 2019

ఓ మహత్మా... మహర్షి

అంశం: ఓ మహత్మా... మహర్షి
తేదీ : 30 -01 -2019 
శీర్షిక: బాపూజీ బ్రతికించవా భరత మాతను మరొక్కసారి... 
సంఖ్య: 134 

విలువలు తెలియని కొంత మంది పాలకులతో విసిగిన ప్రజలు  
విచక్షణ లేని కొంత మంది అధికారులతో  విరక్తి నిండిన జనులు 
అవినీతి, బంధుప్రీతి,లంచగొండి తనాలతో  అట్టుడికి
అధః పాతాళానికి అంచున ఉన్నది విశ్వ వేదికలలో 

ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నయి  స్వాతంత్య్రం వచ్చి  
ఎగుడు దిగుడు లేదు సాధారణ ప్రజా జీవితాన   
ఎనభై శాతమున్న కర్షక,కార్మిక,జవాన్ల జీవితాన 
ఎలుగులు నిండుగా రాలేదు డెబ్బదేండ్లు గడచినా!

పనికొచ్చే విషయాలతో పాఠ్యఅంశాలుండవు 
పట్టు బట్టి ప్రజా అక్షరాస్యతను పతనం కావించారు 
గుడిని తలపించాల్సిన సర్కారు బడులన్నీ    
గుదిబండలుగా మారి  భారమై పోతున్నాయి.  

వినువీధులలో  ఫరిడవిల్లిన విశ్వవిద్యాలయాలు 
వింత వింత    అనారోగ్య  కారణాలతో  కనుమరుగై  పోతున్నయి 
ప్రజారోగ్యాలకై వెలసిన ఆరోగ్యాలయాలేమో
పక్షవాతమొచ్చినట్టు పడకేసి పరిహాసిస్తున్నయి 

పన్ను కట్టిన వాహనదారులతో
పక్క దార్లెన్నుకున్న ప్రభుత్వాలేమో
ప్రవేటు భాగస్వామ్యమంటూ టోల్ టాక్సులు
పజీత చేసి ఏండ్ల తరబడ లాగుతున్నరు

ప్రభుత్వాలు  మాత్రం సన్నాయి నొక్కులతో 
పన్నులు వేయడం,పద్దులు కేటాయించడం ఆనవాయితీ, 
ప్రజల బాగోగులు పట్టించుకోని పాలకులకేమో
ప్రవేటు  అక్షయపాత్రయై పాడిగేదె అవుతున్నది.
విశ్వానికి విలువల మార్గాలు నేర్పిన దేశానికి 
విలువలేని జడపదార్థ మార్గం ముంచుకొస్తున్నది 
బాపూజీ బ్రతికించవా భరత మాతను మరొక్కసారి 
జాతిపితవై  ఆలకించవా జనుల గోసను ఇంకోసారి 


నగునూరి రాజన్న

No comments:

Post a Comment