Thursday, April 18, 2019

చిలిపి ఊహా

అంశం : చిలిపి ఊహా 
తేదీ : 02-02-2019
శీర్షిక: విజయానికి నాంది . 
సంఖ్య : 136

జీవకోటికెల్ల వైవిధ్యం  
మానవ మేథ అన్నది తథ్యం 
ప్రతి ఆలోచన చిలిపే ప్రథమం 
ప్రయత్నించి సాధిస్తే సుగమం 
పలుకుతుంది తదుపరి మానవ కళ్యాణం. 

నింగినెగిరె పక్షుల పరిశీలన 
కుంగక కలిగిన ఎగిరే ఆలోచన 
నిండు విహంగమై నిలిచెను నేడు 
పండు నెత్తిన పడినంతనే 
పైకెందుకు ఎగురలేదని 
పసిమి ఆలోచన సైతం 
నిలిపె భూమ్యాకర్షణ సిద్ధాంతం. 

రవి అస్తమించని తెల్ల సామ్రాజ్యానికి 
మిత వాదుల అహింస సత్యాగ్రహం 
ప్రారంభాన చిలిపిగ తోచి 
అతివాదులు అచ్చెరువొందిరి 
అనతి కాలములోనే  సగర్వముగా   
స్వాతంత్య్రం సాధించిరి. 

పడిలేచిన కెరటంలా 
మలిదశ తెలంగాణోద్యమం సైతం 
చిలిపిగ తోచినా 
వాటా నీళ్లు, నియామకాలు, నిధులంటూ 
వడి పెరిగిన ఉద్యమానికి తలవంచి 
వరుస విజయాలు సాధించాము.  

నగునూరి రాజన్న 
 

No comments:

Post a Comment