Thursday, April 18, 2019

గాలి పటాలు

నగునూరి రాజన్న
అంశం :గాలి పటాలు 
తేదీ : 16-01-2019
శీర్షిక : మిల మిల ...గాలి పటాలు
124

వన్నె చిన్నెల గాలి పటాలు 
వాలు గాలికి వన్నెలద్దెను
రంగు రంగుల అందాలు
చిత్ర విచిత్ర ఆకృతుల
చిన్న పెద్దను అలరించేను.

మిల మిల మెరిసే గాలి పటాలు
మింటికెగిరే స్వేచ్చా విహంగాలు
సంక్రాంతి శోభకు ఆనవాళ్లు
సర్వ జనులకు ఆనందాలు.

ఆకాశానికి నిచ్చెన వేసి
ఆశల సౌధాల అందలాలిస్తాయి.
ఆడా మగా గెంతులేయ
ఆనందాలే వెల్లివిరుస్తాయి.

కానీ .....
ప్రజల మోమున ప్రసన్నతలు నింపి
పురి విప్పే ఆనందాల నీడన
కరిమబ్బుల చీకట్లెన్నో ......
కార్మిక పరివారాల పరేషాన్ లెన్నో .....

స్పందించాలి సరైన సమయాన
సవ్యమైన విధానం కోరే 
సాధికారపు  సర్కారు  సైతం
కంచె వేయాలి కఠినంగా....కార్మిక చట్టాలకు.

నగునూరి రాజన్న

No comments:

Post a Comment