Thursday, April 18, 2019

నది పలికే వాక్యం

అంశం : నది పలికే వాక్యం
తేదీ : 04 -02 -2019
శీర్షిక : సదా మానవ శ్రేయస్సే నే కోరుతా.....                 
సంఖ్య: 137

విశ్వ గ్రహాల వెలుగుల కేంద్రం
విశాల నిర్మల నిండు సంద్రం
విచిత్ర కలయికల విజ్ఞాన సంగమం
విధి లిఖించిన నా జననం....

ఊపిరాడని ఉష్ణమునందు
ఆవిరులను పీల్చిన మేఘం
మంచి ముత్యాల వరుసలుగా
ధరణి చేరును వర్షముగా .....

చెరువులు కుంటలు దండిగా నిండ
జంగల్ సాంతం చుట్టుముట్టి
ఔషధాలెన్నింటనో  మూటలు గట్టి
జలనిధినై అవతరించా నది రూపంగా
మానవాళిని మమతలతో బ్రోవంగా .....

ఇరువైపుల నామూపురాన
ఇంపుగ పెరిగే చెట్టు పుట్టకు తోడూనీడై
ఆకుపచ్చని తోరణాలయ్యే
అరణ్యాలకు, చేను చెలుకకు అండదండై....

వలసలోచ్చే పశు పక్ష్యాదులకు,
వన్యజీవులకు, జలచరాలకు,
వరుసన ద్వితీయ ప్రాదామ్యం మానవాళికి
వనురుగ నిలిచి కేంద్ర బిందువునౌతా.....

జలజల పారే జీవగంగను
జలగల్లా ఇసుక తోడుకుంటున్నా ...
గల గల సవ్వడి చేసే నేను
మలిన గరళాలతో నిలువెల్లా
విష రసాయనాలు నింపినా ....
మీ నాగరికతకు మూలం
నన్ను నగుబాటు సేయకు నేస్తమా!
మౌనంగా మూగ వేదన భరిస్తున్నాను మిత్రమా!
అయినా సదా మానవ శ్రేయస్సే నే కోరుతా......

నగునూరి రాజన్న

No comments:

Post a Comment