అంశం : మొదటికే మోసం
తేదీ : 07 -11 -2019
శీర్షిక : పోలిథీన్
సంఖ్య: 147
ప్రజల సౌకర్యమే పరమావధిగా
పయనమారంభించినది యదార్థం.
పరిచయమే అక్కర్లేని పదార్థం.
అవసరాలు అత్యవసరాలకు తోడైంది.
ఆనందంగా ఆదరించాం.
అపురూప సౌకర్యం అనుకున్నాం.
అందుబాటు కాకుంటే ఎలా ఉండునో ?
అని కూడా ప్రశ్నిచుకున్నాం...
అవసరమున్నా లేకపోయినా
ఆక్రమించుకున్నది సాంతం....
నిద్ర లేచింది మొదలు
ముద్ర పడుతుంది దంత దావనాన....
పాలకు, పెరుగుకు, నీళ్లకు, నూనెకు
పూలకు,పండ్లకు, కూరగాయలకు,
వండినవాటికి, వండని వాటికీ,
వేడివాటికి, చల్లవాటికి,
తడి వాటికి , పొడి వాటికి,
తేడాలేదు ఏ దానికి
సరుకులకు, సవాలక్షవసరాలకు,
మంచికి, చెడుకు చివరకు
రోజువారి చెత్తకు సైతం....
మనిషినంటి పయనిస్తున్నది
మన పంచన నిదురిస్తున్నది ....
పతనమైన శితిల స్థితిలో
ప్రతి అడుగున ప్రత్యక్షం.
పర్యవరణాన కలిసిపోదు
ఫలితం అర్థమయ్యేలోపే
ప్రజలకు పక్కలో బల్లెమై నిలిచింది పాలిథిన్
జల వాయు భూసార స్థితులకు ఎసరు..
ప్రజలు , ప్రభుత్వాలు
పట్టించుకునుని కళ్ళు తెరవకపోతే
మొదటికే మోసం...
మానవ ఉనికికే ప్రమాదం మిత్రమా...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment