Wednesday, April 17, 2019

విశ్రాంత జీవనం

అంశము:విశ్రాంత జీవనం
22 - 12 -2018 
శీర్షిక: ఉన్నత మార్గదర్శి
సంఖ్య : 108

అమ్మ కడుపున ఆరంభమై
పురుడు పోసుకున్న 
అంకుర పయనం 
జీవన గమ్యంలో కదిలే  కెరటం .....

నాన్నల ఆలనాపాలనల్లో
బాల్యమంతా బంగారుమయం...
బతుకు గమ్యానికి విద్యాశిక్షణలు జోడిస్తూ 
మెతుకు వేటలో సాగే 
ఉరుకుల పరుగుల జీవనయానం .....

కన్నవారిని కనుసన్నల్లో నిలుపుకుంటూ 
మంచిచెడుల వాకబులతో 
కనిపెంచే వారికి కంచెగా నిలిచి 
కర్తవ్యాల బాటలో కదిలేదే
జీవుడి జీవన పయన గమనం......

పయన గమనం కొంత యాంత్రికమైనా
పసందైన తారస ఘట్టాలను ఆస్వాదిస్తూ ...
పదుల మిత్రులను పదిలపర్చుకుంటూ 
మనసైన వ్యాపకాలతో సేద తీరాల్సిందే....

నిండైన జీవితాన కాచి వడబోసి గడించి 
పండిన ఆలోచనల సవ్వడులను
నిజ విశ్రాంత జీవనాన నింపు
దేశ, భాష, జాతి, కుటుంబ సేవలకై......
నిలువు ఉన్నత మార్గదర్శివై.......

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment