నగునూరి రాజన్న
అంశం : ఏకాకి జీవితం
తేదీ : 10-01-2019
శీర్షిక :ప్రకృతే మనకు పాఠశాల.
సంఖ్య : 119
మనసు ఒంటరైతే ధ్యానం
మనిషి ఒంటరైతే గర్వం
అమ్మానాన్నల అడుగు జాడలో
అలవర్చుకున్న అలవాట్లో ......
అవపోశన పట్టి నేర్చుకున్నవో
అక్కున చేర్చుకున్న పద్దతులో
అంటీముట్టనట్టు సాగే తత్వం ....
కొంతమంది
ఉమ్మడి కుటుంబాల ఊసులు మరిచి
కుల మతాల కుంపట్లలో
గుణగణాల వాకిట్లలో
అనుబంధాలు ఆద మరిచి
ఆత్మీయతల కుబుసం విడిచి
మంచిని తప్పక వంచన చేస్తూ
మానవత్వాలను మంటకలిపి
ఆర్థికాంశాలే తోడు నీడగా
అలితేరే జనులంతా ఏకాకులే ......
అన్నీ ఉండి ఆదరణ కరువు కొందరికి
ఏమీ లేక ఎవరికీ పట్టరు ఇంకొందరు....
జ్ఞాన సంపద లేని
పశు పక్ష్యాదులు, జంతువులు మాత్రం
ఇంకా గుంపులే , మందలే .....
జ్ఞానముందనుకుంటున్న
మనిషి మాత్రం
ఆధునికత పేరుతో కొంత
స్వార్థం చింతతో కొంత
సాంకేతికతతో పేరుతో సాంతం ....
ఏకాకే .........
ప్రకృతే మనకు పాఠశాల.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment