Thursday, April 18, 2019

పేనుకు పెత్తనం తేదీ : 12 - 03 -2019

అంశం : పేనుకు పెత్తనం 
తేదీ : 12 - 03 -2019 
శీర్షిక : మన పయనమెటు ? 
సంఖ్య : 148 

భూమి గుండ్రంగా ఉన్న చందంగా 
స్వార్థాల చిక్కులు రాజ్యాలు బొక్కినయి. 
పరాధీన పాలనలతో పడరాని పాట్లు 
దిక్కుమొక్కులేని దివాళా బానిస బతుకులు. 
అష్టకష్టాలమయం ఆసేతు హిమాచలం 
తరాల తలరాతలు నీటి మూటలయినై. 

స్వార్థమెరుగని సరంగులు
స్వాతంత్ర్యాలు సంపాదిస్తే ...
సందు తెలిసిన పందికొక్కులు 
సర్దుకుంటున్నాయి మిత్రమా....

తాగి తల గొరిగించుకుని 
ముని మాపు లేసి ముడుచుకో జూసినట్టు
కళ్ళు మూసుకుని కవాతు చేస్తే 
అడగక పోయిన జనాలకేమో 
చిల్ల పెంకుల ఆనందాల పంచి.....
అప్పుడే పుట్టిన వాళ్ళ బిడ్డకేమో
అచ్చెరువుగా  వేల కోట్లు ...

పేనుకు పెత్తనమిచ్చిన చందంగా
సాంతం నిలువు దోపిడీయే నేస్తమా... 
సమయమిదే సంధించుకో 
మన పయనమెటు ప్రశ్నిచుకో..... 


నగునూరి రాజన్న

No comments:

Post a Comment