Thursday, April 18, 2019

ఆహ్వానం

అంశము: ఆహ్వానం 
సంఖ్య: 113
తేది : 01 - 01-2019

పంచభూతాలు ప్రస్ఫుటిస్తాయి 
ప్రాణవాయువుతోనే పయనిస్తుంది...
పగలు రేయిల పరిభ్రమణాలు 
పక్కాగా సంచరించే సూర్య చంద్ర నక్షత్రాలు.... 

సూర్యోదయంతో రోజు మారుతుందని 
కక్కుటానికి సైతం కనువిప్పయినా 
సంధ్య మారితే వింతేదో జరిగినట్టు
కలిజనులకు కాలజ్ఞానం కలగడం లేదు 

ప్రకృతిలో మార్పు లేనిది 
కాల విభజనలో  కట్టడి లేనిది
ఒక్కో నెల ఒక్కో లెక్కతో .....
నెల నెల ఎక్కువ తక్కువలతో .....
ఒకే నెల వేర్వేరు రోజులతో.... 
కనబడే సూర్య వెలుగున కాకుండా 
కటిక చీకటి మధ్య కాల విభజన... 
ఒక రోజుకు ఒక పగలు రెండు అర్ద రాత్రులు...
వింత గొలుపు వివరం వినడానికే....

పాతను వదలలేక 
కొత్తను పట్టుకోలేక  
అసౌకర్యం అనుభవిస్తున్నా
కొందరిలా ఎందుకో?

సంప్రదాయాలు వదలలేక
సంధి కాలములో ఇమడలేక 
సంపూర్ణముగా ఆస్వాదించలేక 
సంస్కారం అడ్డొస్తున్నది.
సంఘ కట్టుబాట్ల దాగుడుమూతలతో
నూతన సంవత్సర ఆహ్వానానికి....

నగునూరి రాజన్న

No comments:

Post a Comment