Thursday, April 18, 2019

బలిపశువు

అంశం : బలిపశువు
తేది : 11 -02 -2019 
శీర్షిక : నాయక ... ప్రజలు 
సంఖ్య : 142 

ఎన్నికలముందు ప్రజలకు 
నూకల ఎరలు వేస్తూ 
లెక్కకు మించి వాగ్దానాలు చేస్తూ 
కల్లబొల్లి నజరానాలంటూ 
కులాలుగా, మతాలుగా కుంపట్లను రాజేసి
పంచేది ఏకానా...
పంచుకునేది పంద్రానా ..... 
ఈ రీతి ఇగురాన   
బలిపశువుల జేసే ప్రజలను ....
పన్నులనేకమేసి...

ఆరువందల పైచిలుకు 
ఆస్థానాలను 
అవలీలగా ఒప్పించి 
అక్కున జేర్చె ఉక్కు మనిషి 
అన్నింటిని కలిపి నిలుప మన దేశాన ... 
కరణం కక్ష కాకతాళీయం కాదంటూ 
కల్లబొల్లి సెక్షన్లు బెట్టె కపట నాయకులు... 
మంచు నక్షత్రాల మించు 
శశిర హిమ శిఖముల పూదోట 
నా దేశ దేహ శిర చిత్రం 
వెండి సరసుల నిండు కుండ
కలుపు ఒడంబడికన............
తరతరాల ప్రజను బలిపశువులన్ జేయ...

ప్రజను పాలింతురు ... ప్రజానాయకులు...  
ప్రజలను బలి పశువు గావించు రదె... ...................నాయక....ప్రజలు...........

నగునూరి రాజన్న

No comments:

Post a Comment