అంశం:పొద్దు పొడుపు
తేదీ: 16--4-2019
శీర్షిక: మార్గదర్శకం
సంఖ్య: 160
అంధకారమే ఎరుగని సప్తాశ్వరథమారూఢుడు
నిరంతర క్రాంతి ప్రసారి
అవని భ్రమణాలే పగలు రాత్రుల మూలకారి
అప్పుడేర్పడేవే నిత్య పొద్దుపొడుపులు
అవే కదా జీవరాశికి నిరంతర గమన గమకాలు....
అపార ప్రేమామృత కలశాలు
అద్వితీయ నిస్వార్థులు... అమ్మానాన్నలు
మంచి చెడులను ఎంచి నేర్పించే
మానవీయ గురుతర బాధ్యులు...ప్రతిగురువు
మానవతకే పొద్దుపొడుపులు ....
బానిస సంకెళ్ళలో బందీలయిన
భరత జాతి పౌరులకు...
స్వార్థంతెలియని నాటి నాయకులు
బాటలు వేరయి పోరాడినా......జాతికి
బ్రతుకులిచ్చిన పొద్దుపొడుపులు....
అందమైన ఆనందాలను మిగిల్చిన
సుందరమైన పొద్దుపొడుపులే....
మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకోని
మానవతకు మార్గదర్శం కావాలని...
ఆకాంక్షతో.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment