అంశం : బొమ్మల కొలువు
తేదీ : 11-01-2019
శీర్షిక : ముక్తి మార్గాలు
సంఖ్య : 120
చిత్ర విచిత్రములు
చిన్మయ తత్వములు
మరలు, యంత్రాలు కారాదు
మానవ జీవితాలటంచు
మధురమౌ మహోత్సవములెన్నో ఏర్పరచె
మానసిక, శారీరోల్లసానికై ....
ప్రకృతి పరివర్తలనల పసికట్టి
పండుగల పబ్బాల పేరున .........
పూర్వీకులు
మెట్లు మెట్లుగా ఆసనాలేర్పరిచి
ధవళ వస్త్రము దండిగా పరచి
జట్లు జట్లుగా అంగణులంతా
పిల్ల పిడుగుల ఆనందాలను ,
అనుభవాల పరంపరలను ,
ఆధ్యాత్మికత ఆలంభనలను
ప్రతిబింబించి పరవశింపజేయు
పసిడి కాంతుల ప్రతిరూపాలను
బొమ్మల కొలువుగ తీర్చు వైనం.....
దసరా, సంక్రాంతులయందు.
ముదితల పేరంటాల సందళ్ళతో
ముద్దు గొలుపు పర్వపు ఉత్సవాలు
ముక్తి పూజల ముగింపు వాక్యముగా ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment