తేదీ: 25 -03 -2019
అంశం : హస్త భూషణం
శీర్షిక: అధునాతన చరవాణి
సంఖ్య: 151
మానవ మస్తిష్కపు అలల సంద్రపు
మనోఫలక కాన్వసుపై పరుచుకనే
స్వేచ్చా విహంగ భావ ప్రకటనలే
చిత్ర విచిత్ర చిలుక పలుకులై
అరవిరిసిన ముత్యాలై
అలవోకగ జాలువారు నోటంట..
విరబూయు శబ్ద పొందికలై...
వివిధ మానవ ప్రకటితాల మూలంగా
విచ్చుకున్న శబ్ద పొందికలకు
విజ్ఞులు విరించై అందించిన ఆకృతి రేఖాక్రమం....
నిలువెత్తు విలువైన అక్షర క్రమాలతో
నిక్షిప్తి గావించుకున్న నిరుపమాన
నిరంతర పరివర్తనా రూపం మన నేటి
నిజ భాషకు నియమిత మూలం...
హస్త భూషణమంటే నాడు
పుష్టి సమాచార భాండాగారపు
జ్ఞాన సంపదకు మూలమని...
విజ్ఞాన బదిలీకి విస్తృతం పుస్తకమని
డంకా బజాయించి ప్రకటించిన మనమే....
నిస్సంశయంగా నిగర్వంగా మారుతున్న
సంధి సమయ కాలానుగుణంగా
ఆధునాతన చరవాణిని.....
సక్రమ వినియోగాల సౌరభ మాల
సంక్రమించు సవాలక్ష పుస్తకాల జ్వాలని...
సుందరంగ మనందరం
సహృదయంగా ఒప్పుకోవాలి మిత్రమా!
నగునూరి రాజన్న
No comments:
Post a Comment