Thursday, April 18, 2019

వైకుంఠపాళీ

నగునూరి రాజన్న
అంశం : వైకుంఠపాళీ
తేదీ :28 - 12 - 2018 
సంఖ్య : 111 
శీర్షిక : ఆదమరిచి నడుచుకో .....

సంద్రమంత సంబరాలకు 
ఉత్సాహాలు నింపే ఊట చెలిమె
శ్రమకోర్చిన విజయ తీరాలు 
కష్టాల కడలిలో కలిసి సాగే 
అనుభవాల సారమే 
వైఫల్యపు అడుగుల నీడలు. 
ఉత్తాన పతనాల ఊపిరులే
మానవ జీవన పోరాటాలు  ..... 

గగనపు గమ్యం చేరాలంటే 
గజానికో గాంధారి పుత్రుడున్న
గతుకుల మార్గమే శరణ్యమయినా 
గమనానికి గట్టి పట్టుదల కావాలి సుమా....

అమాంతపు ఉన్నతాలకు చేర్చే 
అదృష్టాల నిచ్చెనలు కలిసి రావచ్చు 
అద:పాతాళానికి చేర్చె
అవరోధాల సర్పాలు ఎదురవ్వచ్చు.... 

మనిషి జీవన పోరాటానా 
మధ్యన ఆపే క్రీడ కాదు.... 
మన ప్రమేయం లేని 
మసక చీకట్లను ఛేదించాల్సిందే.... 

ఉన్నతంగా ఎదిగినా 
ఉన్నఫళంగా పడినా 
అనుక్షణం అవలోకించు 
ఆదమరిచి నడుచుకో ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment