నగునూరి రాజన్న
SK 624
ఆదరించండి ....ఆడవారిని
గుప్పెడంత ప్రేమను గుంభనంగా
గుండె లోతుల్లో నింపుకుని
పెనిమిటి ప్రతిరూపం ప్రతినిమిషం
పెన్నిధిగా తలిచి నిలుపుకుని
ఆచారాల చిరునామాగా
సంప్రదాయాల సద్భావనగా
అప్పో సప్పో అమర్చుకునేరు
ఆకంత పసిడి ఆకృతి ప్రతిరూపంగా...
చెట్టంత మనిషిని
కట్టి పడేసే మంత్రంగా
సంఘ జీవనాన నిలుప
సత్సాంప్రదాయాల పునాది
ఆడపిల్ల అమ్మైనా
దేవుడి బొమ్మైనా
ఎదురు లేదు బాడకావులకు
ఎంతకైనా బరితెగించి పేట్రేగుతున్నరు....
రక్షకులకు వాహనాలే కాదు
భక్షించే పిస్తోల్లివ్వండి
పిట్టల్ని కాల్చినట్టు
పిసికి ప్రాణాలు తీసి ....
ఆదరించండి ......ఆడవారిని.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment