అంశం : ఈ దేశానికి నేనేమిస్తాను
తేదీ: 14 -03 -2019
శీర్షిక : చేయను....
సంఖ్య : 149
తనువు చీల్చి పిల్లలకు
తల్లి జన్మనిస్తుందని మరిచి
భూదేవి పొరలు కోసి
గనులనమ్ముకోను.........
ఆరుగాలం కష్టించి
అన్నపూర్ణనందించి
ఆకళ్ళు తీర్చే అమృతమూర్తి
అరకదున్నే రైతన్న ఆత్మ హత్యలకు పాల్పడి
హలొ లక్ష్మణా! అనిపించే
అరిగోసలు రానీయను........
విచ్చలవిడి పాలిథీన్లను
విశ్వ వీధుల్లో వెదజల్లి
జీవకోటి బ్రతుకు గమ్యపు
జీవన ద్వారాలు మూయను.....
నిజాయితీ సేవలంటూనే
నిలువునా పాతరేస్తూ
నిత్యం చేసే ప్రతి పనిలో
నిలువెత్తు వాటం ప్రదర్శిస్తూ
కంచె చేను మేసిన చందంగా
కవాతు చేయను.................
మండుటెండల్ని మల్లె సొగసులుగా
మంచు తుఫానులను మంచెలుగా
జడి వానలను గుడి వాకిటగా తలుచుకుని
కుటిల కంటక దాయాదుల కబంద హస్తాల నుండి
కంటికి రెప్పలా కన్నభూమిని
కాచుకునే జవాన్లను మరిచి
మానవత్వానికే మచ్చ తేలేను ....
ఉచ్చనీచములు ఉష్ కాకి గావించి
మనిషిన్న ఊసునే మదిలోన మెరవనీయక
మంది మార్బలమేసుకుని
మానవత్వానికే మచ్చ తెచ్చే పనులను
మచ్చుకైనా చేయను...
ఇవేమి చేయక పోగా .....
ఇగురంగా చేసేవారి పై
బాణమెక్కుపెడతా ... బాజా బజాయిస్తా....
ప్రతి పనిని ప్రశ్నిస్తా ?
నగునూరి రాజన్న
No comments:
Post a Comment