అంశం : ప్రవాసుల పాట్లు
తేదీ : 22-01-2019
శీర్షిక : సర్కారు సైతం....
సంఖ్య : 128
జనాభాలో రెండవది
ఖజానాలో చివరిది
విడమరిచి ప్రజాసేవ చేయ
వీలు లేని నాయకులు ......
విద్య వ్యాపారం చేసి
వింత చూస్తున్న సర్కారు ......
ఉద్యోగ కల్పన ఉనికి కోల్పోయింది.
ఆకలి బాధను అధిగమించ
అప్పుల కుప్పలకు అలితేరి
అమ్మ నాన్నలను ,ఆలు బిడ్డల వదిలి
కదిలే కడుపుల పేగులు పట్టుకుని
ఆవలి గట్టుకు పయనమైరి
అప్పులు దీర్చ సంద్రం దాటి ....
మనుషులమే కదాని
మధ్యవర్తుల మాటలు నమ్మి
మిధ్య బతుకుల బాటలో
మోసపోయి నిండామునిగి
ముద్ద దిగని ప్రవాసులెంతో మంది.....
సహవాసులు, స్వచ్చంద సంస్థలు
అందిస్తున్న ఆపన్న హస్తం
అనిర్వచనీయం....
సర్కారు సైతం నడుం బిగిస్తే
సాగదా జనజీవనం స్వచ్చంగా....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment