Thursday, April 18, 2019

ఒకే ఒక్కడు -2

ఒకే ఒక్కడు -2  

నిజాయితీ కలిగిన ఉద్యోగిగా -నీతి వంతమైన పాలకునిగా
సిద్దాంతాలకు కట్టుబడి నిలబడినాడు-  స్వయంకృషితోసాధించాడు

పట్టుదలదీక్షలకు ప్రతిరూపమై - ప్రకాశ వంతమైన వర్చస్సుతో
పరితపించి , పరిశ్రమించే వారి త్వం - ప్రతి వారిని పులకింపచేస్తుంది

విద్య వినయం కలబోసిన రూపం -చిరునవ్వులు చిందించేమూర్తిత్వం
భవిత మీదేనని యువతకు చాటిమేల్కొల్పిన నిత్యకృషీవలుడు  

మచ్చ లేని మానవత్వం - మచ్చుకైనా కాన రాని డాంబికత్వం
నిలువెల్లా పులకించే దేశభక్తి -నిలువరించు ప్రతివారిని ప్రతి క్షణం 

నిరంతర విషయ సంగ్రాహి - నిత్య పాద్యాయ విద్యార్థి
సూక్ష్మ గ్రాహి , స్పురద్రూపి - స్ఫూర్తి దాత, మార్గ దర్శినిర్దేశి

శాస్త్ర సాంకేతికతలో నిష్ణాతుడైఆకాశమే హుద్దుగా ఎదిగినా
కాలిపర్స్కలాం రాజు స్టంట్ లతో - సగటు ప్రజలకు సైతంసార్థకత చేకూర్చారు

లెక్క లేనన్ని అవార్డులు - లెక్కకు మించిన రివార్డులు
విశ్వ విద్యాలయాల డాక్టరేట్లు - విశ్వ దేశాల ఫెలో షిప్పులు

పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ రకు - రామేశ్వరం నుండి రాజభవన్ వరకు
స్వయం కృషి తో సంధించుకున్నాడు గగనతలం లో నక్షత్రమైనిలిచాడు

అఖండ ప్రయాణం సాగించి -ఆఖరు క్షణం వరకు ఆరాటపడి 
అనాయాస పవిత్ర మరణం తో - అమరత్వం పొందినమహానీయుడు. 

అతనే మన అబ్దుల్ కలాం ..... 

No comments:

Post a Comment