Thursday, April 18, 2019

వాయిదా

నగునూరి రాజన్న
అంశం: వాయిదా
తేదీ : 29 - 12 - 2018
సంఖ్య: 112
శీర్షిక : న్యాయపు నగారా ....

చట్టం తన పని తాను చేస్తుందని
రాజకీయులు వల్లె వేసినట్టు......
చరాచర విశ్వంలో చలన ప్రక్రియంతా
చక్రబంధములో జరిగిపోతుంది....

మనిషి మసలే మతలబులకు
మాత్రమే ఈ వాయిదాలు
మాటువేసి కొట్టే ఫాయిదాలు
మట్టి కొట్టుకపోవు దఫా దఫాలు....

అవునండోయి !
గుర్తొచ్చిందీ ...గుర్తొచ్చిందీ...
వాయిదాలు....
ఫాయిదాలు....
అంటేనే
రాజకీయం...
న్యాయవాదం .....

మంది సొమ్ము మంగళవారమన్నట్టు
జనం సొమ్ము జమా ఖర్చన్నట్టు
నాయకులు జనం కోసం
వాయిదాలే వాయిదాలు ...

ఇక చట్టాలు చుట్టాలైతే తప్ప
జన సామాన్యపు న్యాయవాదమైతే
పిడి వాదనలతో పిండాకూడు పెట్టి
పీడీలకొద్దీ సాగదీసి వాయిదా వేస్తే తప్ప
న్యాయం నగారా మోగించదు..........

కానీ ....మరో కోణంలో.......
చీకటి మాటున మగ్గుతున్న
చిన్నకారు, సన్నకారుకు
చిరు దీపపు కాంతియై
ఆర్థిక పరిపుష్టికి, అభివృద్ధికి
ఆలంబనగా నిలిచేది
వాయిదా చెల్లింపుల
వడ్డించే రుణ వ్యవస్థే సుమా!

నగునూరి రాజన్న

No comments:

Post a Comment