అంశం : సృజన
తేదీ 08-02-2019
శీర్షిక : విధాత సృజనకు శ్రీకారం...
సంఖ్య : 141
వినమ్రంగా పరికిస్తే
వివరంగా పట్టుబడదా...
విశ్వం అడుగడుగున నింపిన
విరివైన రహస్యాల విజ్ఞానఖని
విధాత అనన్య సృజనకు శ్రీకారమని !
ఆలకిస్తే అవగతమే ...
అలుపనేదే లేకుండా
అవసరాలకనుగుణంగా
అడగక ముందే ఇంటిల్లిపాదికి
అన్నీ అనుగుణంగా అమర్చే
అమృత మూర్తి ఆప్యాయతల గని
అందరిని చేరలేని
ఆదిదేవుడు సృష్టించిన
అపురూప సృజనకు ఓంకారమని !
నిలకడగా గ్రహిస్తే
నిఖిలమే కదా....
నియాండర్తల్ దశలనుండి
నిశబ్దాలను ఛేదించి
నియమానుసారంగా
నిష్ఠతో శబ్దాలకు రూపమిచ్చి
నిజ భాషలను బ్రతికించిన
ఆది గురువులకు వందనం !
నగునూరి రాజన్న
No comments:
Post a Comment