Thursday, April 18, 2019

ఒంటరి చందమామ

అంశం : ఒంటరి చందమామ 
తేదీ 09-02-2019
శీర్షిక : చుక్కల్లో చంద్రుడు 
సంఖ్య  : 142

ఆవు తోలును  అడ్డం పెట్టుకుని 
వాణిజ్యమంటూ వాలుగా జేరి 
వరమడిగిన వామనుడు వసుధను 
వాల్చి చంకన బెట్టుకున్నట్టు .... 
భారతాన జొచ్చిన ఆంగ్లేయులు 
వారిని వీరిని  అడుక్కుని 
కాలం వెళ్లబుచ్చుతూ   
కపట  నాటకాల  దమన నీతిన  
పాలన మంత్రదండం 
పచ్చిగా చేజిక్కించుకొనిరి ......... 

పామరులై నర్తించిరి 
ప్రజలను హింసిస్తూ ...  
పన్నులనేకమేసి 
కన్ను మిన్ను కానక 
రవి అస్తమించని 
రాజ్యం మాదంటు 
విర్రవీగె  తెల్లోడు  .... 

తల్లి కష్టాలను తరిమివేయ  
తనయులనేకం 
తమ తమ రీతిన సాగించె 
స్వాతంత్య్ర పోరాటం..... 

వందలు, వేలు, లక్షలు 
ఎందరో మహానుభావులు 
అందరికి వందనాలు .. 
అయినా ....  చుక్కల్లో చంద్రుడాయె 
చక్కంగ వినుతికెక్కె  
అహింస వాదిగ 
ఆ గాంధీజీయే..... మన జాతి పితగా...... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment