అంశం: రాజీ మార్గం
తేదీ: 13 -02 -2019
శీర్షిక : అప్పుడప్పుడదే రాచమార్గం.
సంఖ్య : 144
జోడెద్దుల సంసారంలో
బడాయి పట్టుదలలకు పోకుండా
సర్దుకు పోవడమే
సజావైన మార్గమని
రాజులా బ్రతుకడానికి
రమ్యమైన రాజమార్గమని
అనుభవిస్తే గాని
అర్థం చేసుకోరు!
పనిపట్ల శ్రద్దాసక్తి
పట్టింపు లేని పాలకుల
ఫర్మానాలు
తూ తూ మంత్రాలౌతుంటే...
ఆత్మ నిలుపని
అధికార గణం ఆజ్ఞలు
అలుసై బేజారౌతుంటే...
ప్రజలే చేత పజీతపాలు అవుతున్న
పచ్చని పర్యావరణాన
బ్రతకడానికి బానిసనై
రాజీపడి బతుకుతున్నా.........
ఒజ్జలై ఒదగాల్సిన
పాలకుల యంత్రాంగం
లజ్జ వదిలి లగాయిస్తున్న
లంచగొండి తనం,
అలుగులై పారుతున్న
అవినీతి ఉప్పెనలో, .....
బడాబాబుల బందీలో
నలుగుతున్న బంధుప్రీతిలో.....
అప్పుడప్పుడావేశ పడినా
చప్పున రెండూ మూసుకుని
కరడుగట్టిన వ్యవస్థీకృత
కరప్షన్ కాలమహిమలో
ప్రజలంతా రాజీపడి
కాలం వెళ్లబుచ్చుతున్నారు .......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment