Thursday, April 18, 2019

యువ భారతం

నగునూరి రాజన్న 
అంశం : యువ భారతం 
తేదీ : 12-01-2019
శీర్షిక : అనుభవైక తరం - అందించాల్సిందే....  
సంఖ్య :121
బాల్యపు బంజరు భూమిని 
బంగరు సాహిత్యపు విత్తనాలతో 
బహు చక్కగా సేద్యము గావించి 
బహుళార్ధక ప్రాయోజితాలు పొందవలసిందే ..... . 

తన శక్తిని తాను తెలియని 
చిరంజీవి వాయుసుతుని 
చిత్రమైన పరిస్థితి..... 
నిబిడీకృత నిజస్థితి 
నిక్ఖచ్చిగ అంచనావేయలేక 
మనసున మసిబూసి మాయగప్పి 
అభివృద్ధికి అవరోధాలయ్యే 
అనుమానపు అడుగులేసే నేటి యువత 
ఏదారి ఎటు పయనమో 
తెలుసుకోలేని ,  తేల్చుకోలేని 
సందిగ్ద కూడలిలో 
సరాగాల కూని రాగాలు తీస్తున్నది ...... 

యువత చేతులు కాలాక 
అనుభవజ్ఞులు  ఆకులు పట్టడం కాదు .... 
చట్టుబండలౌతున్న యువత భవిత కొరకు ....  
సాధించిన సాంకేతికత 
సార్ధకం కావాలంటే ...... 
ప్రగతి రథ చక్రం  పక్కదారి పట్టకుండా 
అవరోధపు గోడలు బద్దలు కొట్టి  
నవ భారతానికి జేజేలు పలుక 
యువ భారతాన్ని ఉరకలు పెట్టించ 
సద్గమనము సంధించి 
నిశ్చల విజయ తీరాలు ముద్దాడ 
అనుభవైక తరం - అందించాల్సిందే 
విజయ సూత్రాల పరంపరల చేయూత.....  
తల్లి తండ్రి గురువు 
గురుతరంగా వేన వేల వివేకులై......   


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment