Thursday, April 18, 2019

జాగరణ

అంశం : జాగరణ 
తేదీ : 05 -03 -2019 
శీర్షిక : పడిగాపులు 
సంఖ్య : 145 

ఆరుగాలం శ్రమించే అరక దున్నే రైతున్నకు 
నీరుగార్చు పంట దిగుబడి ప్రకృతి కన్నెర్రతో 
పంట ఇంట కాలు మోపే వరకు....
ప్రకృతి వాతావరణ అల్లకల్లోలాలకు
ప్రతిక్షణం పడిగాపుల జాగరణే.......

శివ పార్వతుల చిద్విలాసం 
హిమశిఖరముల కొండ కోనలు.... 
పరివారాలకు పదామడగా 
పంచ ప్రాణాలను పణముగా పెట్టి 
అసువులు ఊసులు ఆవలనెట్టి
ప్రజల సుఖ శాంతులే ఉఛ్వాస నిచ్వాసలుగా 
ప్రతి క్షణం జాగరణ చేసే 
పవిత్ర సైనికుని నివాస క్షేత్రం..... 

కాల మార్పుల కనుగుణంగా 
కాయ స్థితిగతుల నిశ్చలతకై 
అపూర్వ అనుభవాల సారంతో 
అచ్చమైన శాస్త్రీయతలను జేర్చి
ఆచారాల సాంప్రదాయాల ప్రోదిగా  
అందించిరి పడగల పబ్బాల పేరుతో
ఆది పూర్వులు మన క్షేమం కోరి ....

మాఘ బహుళ చతుర్దశిన 
మారబోవు కాల సంకేతంగా ...
మన తనువుల సానబెట్ట 
మహాశివుని పేరుమీద 
మనం పాటించే శివరాత్రి జాగరణ ...

నగునూరి రాజన్న

No comments:

Post a Comment