Thursday, April 18, 2019

అవలోకనం

అంశం : అవలోకనం 
తేదీ: 02 -01 -2019 
శీర్షిక : అవలోకనం- నడవడి తీర్పుల త్రాసు 
సంఖ్య: 114 
 
మంచి చెడుల సంగమం 
కష్ట నష్టాల కల్లోలం 
సుఖ దుఃఖాల సంద్రం 
మానవ నిత్య జీవనం 

గత కాలపు అనుభవాలు 
నడిచే కాలపు సోపానాలు 
ఈనాటి అవలోకనాలు  
నిన్నటి తప్పుల కుప్పల
ఆనవాళ్ల తిప్పలు 

బహిర్ ప్రవర్తనకు 
అంతర్ అవలోకనమే 
విడివడని ముడి బంధం 
నడవడి తీర్పుల త్రాసు బందం 

అయినా ......
కపట నాటకీయుల కబంధ హస్తాల్లో 
కలిమాయల నీడల్లో 
కమల కోమలమైన మంచితనం 
కబలించబడుతూనే ఉన్నది..

గత ఛాయల నేపథ్యం లేదు 
గడుసుతనపు గూండా కాదు 
చామన ఛాయా మేనితో 
సగటుకన్నా తక్కువెత్తు 

భాష మక్కువ బాటసారి 
బహు బాషా కోవిదుడు 
అనర్గళ వాక్చతురుడు 
అవసరాన అందిపుచ్చుకున్న మహనీయుడు 

కుటుంబ సభ్యులకొరకు 
కుళ్ళు కుతంత్రాలు తెలియదు 
దూర దృష్టి కలిగినవాడు 
దేశ ఉన్నతిని స్వప్నించాడు 

నాడు చేసిన దేశ మేలుకు
తర తమ బేధమనక అన్ని పార్టీల రాజకీయ దురంధరులతో 
అన్ని వేళలా అవలోకించబడుతున్నాడు... 
సర్వజనులతో సంకీర్తించబడుతున్నాడు 
వారే మన పాములపర్తి వేంకట నరసింహుడు ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment