Wednesday, April 17, 2019

ఆశ్రమాలు

నగునూరి రాజన్న 
అంశం: ఆశ్రమాలు 
తేదీ 21 -12 -2018 
శీర్షిక :  అవసరానికే ఆశ్రమం 
సంఖ్య: 109  

అనాగరికతలో అడ్రెస్ లేనిది 
అరణ్యవాసం నుండే మొదలయ్యింది 
అకుంఠిత శిక్షలతో ముడిపడి సాగింది  
అనంత దీక్ష దక్షతలకు కేంద్రమైంది.....

ఆకాశ వీధి పక్షికైనా
అట్టడుగు సంద్రపు జీవికైనా 
అత్యవసర ఆలనా పాలనలకు 
అడుగడుగున ఆదరించి నిలిచేది ఆశ్రమం....

విజ్ఞానానికి విలువలిచ్చి
విశ్వ విద్యాలయాలుగా తీర్చిదిద్ది 
విద్యార్థుల ఆవాసానికి ఆలవాలమై 
విశ్వ అభివృద్ధికి మూలమైంది విద్యాశ్రమం.....

బాల్యాన కనువిందుల చేస్తూ 
బతుకు పంటలో  వికసించి
భావితరాలకు బాటలు వేసేదే
భవ్యమైనది గృహస్థాశ్రమం .....

ఆశ్రమాలన్నీ ఎదో ఒక అవసరానికే ఏర్పడినా 
స్వార్థాలు పెరిగి సంఘ తిరోగమనానికి మచ్ఛుగా 
మానవతకే మచ్చ తెచ్చే వృద్ధాశ్రమాలు 
మాత్రం మనకొద్దని ఎలుగెత్తుదాం.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment