కళాశ్రీ చిత్ర కవిత
తేది : 29-10-2022
శీర్షిక : చిత్ర విచిత్రం ..
చిత్రమే విచిత్రమే
కళాకారుని చమత్కారం
కనులలోన పానుపేసి
కట్టిపడేసింది బందీగా ...
కణికట్టుగ కావ్యమయే
కమనీయపు దృశ్యం ...
మననపు మంతనాల
మనోల్లాస సంతసాలు ...
పసిడివర్ణ ఛాయలతో
పడతి మోము ఫరిఢవిల్ల
గతి తప్పని గుండె లయలు
మతి తప్పే పదనిసలు ....
మదినిండా గమ్మత్తులు
మహోన్నతమై సాగగా
మమకారమై చిలికింది
సంతృప్తిని నింపింది ...
కాదేది కవితకనర్హం లా
అవునన్నది చిత్రమై
అంకురించె కుంచెనుండి
చిత్రకారుని మదిలోన ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment