Wednesday, May 10, 2023

కార్తీక దీపం తేది : 31-10-2022 శీర్షిక : మహోన్నతం

 కార్తీక దీపం 

తేది : 31-10-2022
శీర్షిక : మహోన్నతం 

దీపం జ్యోతి పరబ్రహ్మం 
దీపేనా హరదే పాపం 
దీపం జ్యోతి కలిగిన ఇంట 
దాపున శ్రీలక్ష్మి ధనముల్ ఇచ్చున్ ... 

మనలో నిబిడీకృతమై ఉన్న 
అజ్ఞానాంధకారాల  దుర్గుణాలకు 
ఆధ్యాత్మికతలను జోడించి  
విజ్ఞాన చైతన్యాలను నింపేది .. 

స్థితి కారక కేశవ దామోదరం
లయకారక జటాజూట శివోహం 
ఏకోన్ముఖులై జీవ జలాలను
ఆదుకునే మాసం కార్తీకమని ..... 

స్వచ్ఛ మనసుతో సంపూర్ణ భక్తితో 
రక రకాల నూనెలు అనేక రకాల 
వత్తులు... వివిధ కోరికలతో వెలిగించే 
దీపాలకు వేర్వేరు ఫలితాలనిస్తుంది ... 

సంధికాలం సమయంలో ... చల్ల 
వాతావరణాలలో .... సూక్ష్మ జీవుల 
నుండి మోక్షం కలుగటంచు కల్పించె 
పెద్దలు  సుద్దులు అనుభవపూర్వకమై ... 

మాసాలలో కార్తీకం మహోన్నతమని  
ఆలయాలలో వెలిగించే దీపాలకు 
అద్భుత ఫలితాలనిచ్చి కరుణా కటాక్షాలతో 
అంతిమాన మిన్నాయే మన ఆరోగ్యం ...  

శుచి శుభ్రతల సుందరం ... 
మడి ఆచారాల మర్మం .... 
ఫలం తోయం పత్రం పుష్పం 
దీపం ధూపం... సమర్పించి మొక్కిన 
సద్గతులు ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment