కణిక
అంశం : -దారం
తేది : 31-10-22
శీర్షిక : మనుగడ
మంచు పువ్వులోన మాగి
మృదువును పొదువుకుని
తెలి మబ్బులై పరుచుకుని
నాగరికతలు నేర్పించ నడిచి
వచ్చింది మన నట్టింటికి .....
అందులోని సుందరతను
గుర్తించిన నేతన్న పాల ధారలుగా
పయనింప జేసి అడ్డాలు నిలువులుగా
అనుబంధాల తీగలను పేర్చి
అందించాడు కానుకగా మానవాళికి ....
నాటి నుండి నేటివరకు
చిన్నా పెద్ద ఆడ మగ తేడాలేకా
అందరిని పలకరిస్తూ కలుపుగోలుగా
ఆత్మీయ బంధమై తనువును అంటి
పెట్టుకుంటున్నది ...
సప్త వర్ణాల రంగులెన్నో అద్దుకుని
రామచక్కని రూపాలతో మనసులను
రంజింపచేస్తూనే... ఎప్పటికప్పు డు
మానవాళి అవసరాలను అవపోశనపట్టి
తీర్చుతూనేఉన్నది ....
గాలిపటానికి ఆధారమై పైకెగిరినా
పడవకు లంగరై నీట మునిగినా
చిక్కమై బతుకులు చక్కబెట్టినా
అడుగడుగున మనుగడై మనిషిని
నిలబెడుతూనే ఉన్నది ... దారం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment