కణిక -
అంశం : ఉపవాసం
తేదీ : 07-11-2022
శీర్షిక : ఆధ్యాత్మికం ఆరోగ్యం
మాసానాం కార్తీకం అంటారు
హరిహరులిరువురికి ప్రాధాన్యం
పత్రం పుష్పం ఫలం తోయం
మహోన్నతం పూజనీయం....
ఒక్కొక్కరు ఒక్కోవిధంగా
కార్తీకం మాసమంతగాని
సోమవారాలు మాత్రమే గాని
ఉపవాసాలు పాటిస్తుంటారు ...
ఉపచారాలన్నీ తెలియకపోయినా
దీపారాధనలు చేసుకుని
ఉపవాసముండి భగవంతుణ్ణి
నామ స్మరణల తలుచుకోవడమే...
మనసా వాచా కర్మణా పాటించి
నిష్కల్మషంగా మొక్కుకోవడం
నిజ భక్తి యోగం ... అంతిమంగా
ఆరోగ్య సంరక్షణలే ఆచారం ....
ఉన్నతమైన ఆచారాలు
ఉదాత్తమైన సంప్రదాయం
ఉత్కృష్టమైన శాస్త్రీయం
ఊతమయ్యే
ఆరోగ్యరహస్యం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment