అమ్మ ముక్కు పుడక
తేది : 07-11-22
శీర్షిక : ఆరోగ్య రహస్యం ...
వేదం...పురాణం...ఉపనిషత్తులు
వాఙ్మయం ....కావ్యం ... రామాయణం
భారతం .. భాగవతం... భగవద్గీత...
శాస్త్రం ... సర్వం సమున్నతం ....
ప్రతీది గ్రంథస్తం మన భారతాన ....
ఉన్నతమైన ఆచారాలు
ఉదాత్తమైన సంప్రదాయం
ఉత్కృష్టమైన శాస్త్రీయం
ఊతమయ్యే
ఆరోగ్యరహస్యం ....
ఇరువది నాలుగు గంటలు
ఇంటికే పరిమితమయ్యే ఇంతులు
ఇంటిల్లిపాదికి ఆద్యంతం సపర్యలు
ఇగురంగా అందించు సేవలు...
ఆరోగ్య రక్షణల అత్యంత ప్రాధాన్యం
కంటికి యింపునిచ్చే కాంతులు
ఒంటికి ఆరోగ్యమిచ్చే ఆభరణాలు
ఆడవారిని ఆదరించే సత్కార్యాలు ...
ఉచ్వాస నిచ్వాసల సమయంలో
తరాల వారధిగా తనువు హూనమయ్యె
సమయాన.. గర్భకోశ ఆరోగ్య పరిరక్షణలో
అత్యంత ప్రముఖ పాత్ర అమ్మ ముక్కుపుడక ...
ఆకారాలెన్ని మార్చుకున్నా ఆదరణలే
రంగులెన్ని మార్చుకున్నా రాజనాలే
ఉన్నంతలో వెండిదో బంగారందో ప్లాటీనందో .. .
ఊతమే ప్రతివారికి ఆరోగ్యరహస్యమై ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment