లలిత గేయాలు
తేది : 19-11-22
శీర్షిక : సింధునది
హిందువులకు పవిత్రమే
సింధువుగా ప్రఖ్యాతం
హిమగిరులే పుట్టినిల్లు
ఇంపైన కైలాసం
సొగసులన్నీ నింపుకుని
సాగుతుంది కాశ్మీరం ...
నాగరికత నడకలలో
వికసించి ప్రసిద్ధికెక్కె
హరప్పా మొహంజోదారో
చరితలోన ఘనతరమై ...
హిందువులకు పవిత్రమే
సింధువుగా ప్రఖ్యాతం
బహుదొడ్డ కట్టడమే
భాక్రా నంగల్ ఆనకట్ట ...
పంజాబు హర్యానా
పాడిపంటలినుమడించ...
ఇండస్ గా బయలెల్లి
జీలం చీనాబ్ రావి
బియాస్ సట్లెజ్ లతో
రంజిల్లెను సంగమమై...
హిందువులకు పవిత్రమే
సింధువుగా ప్రఖ్యాతం
ఆసియాన సంధానం
దేశాలను కలుపుకుంటూ
ఆధారం ప్రజలకు
తాగునీరు సాగునీరుగ ...
ఎటమట పయనమే
పటమట దక్షిణమై
అరేబియా సంద్రమున
ఆత్మీయ సంగమమై..
హిందువులకు పవిత్రమే
సింధువుగా ప్రఖ్యాతం
No comments:
Post a Comment