ఆనంద మందిరం
తేది : 29-03-2022
శీర్షిక : ఆనంద నందనం
కవిత సంఖ్య : 879
డాబు దర్పాలతో దక్కేది కాదు
బాబు అయ్యా అంటే చిక్కేది కాదు
బింకాలకు పోతే బొక్క బోర్లానే ...
పైసా ఖర్చు లేని పనే అది ...నిష్కల్మషాల
నీతి న్యాయ ధర్మాలతోనే దోస్తీ ....
మద మాత్సర్యాలెరుగని
తెలిసీ తెలియని వయసే
తెస్తుంది తేనెల ఆనందాలు
జీవితానికి సరిపడే జ్ఞాపకాలు ....
వంకలు దీర్చే వయసులు
మెల్లిగా నేర్పింది బింకాలు...
నడమంత్రపు సిరిలాగా
నాట్యాలు చేయించుతుంది ....
బాగా ఉన్నవారితో పోల్చుకుని
బాగ లేదని బాధపడడం కాదు ....
కాలు వంక లేదు..కన్ను వంకా లేదు ...
అన్నీ బాగున్నా ఆశ చావదు ....
అత్యాశ వీడదు... పేరాశ వదలదు ....
తక్కువున్న వారితో పోల్చుకుంటే
తప్పకుండా నిండు ఆనందాలు
కల్మషాలన్నీ దులిపేసుకుని
తడుముకుని చూస్తే మనసంతా ...
పుట్టుకతో వెంట తీసుకురాని
పట్టుదలలన్నీ వదిలి పెట్టి
మెట్టు దిగి చూస్తే పట్టదా మనకూ
ఆనంద నందనం మదినిండా .....
No comments:
Post a Comment