కణిక -
బుధవారం బాద్షా
తేది : 02-11-2022
అంశం : బిడ్డా జర పయిలం
కలిమాయలో ... కాలం తీరో
తమ పర బేధం లేదు ... వావి వరుసలు
లేవు ... మానవత్వం మచ్చుకైనా
కానరావడం లేదు... మనిషితనం మంట కలిసి
ఆడవాళ్ళ చెర అనే వార్తలేని రోజు లేదు ...
బయటికి వచ్చేటివెన్ని .. లోలోపల నలిగేవెన్ని...
అందుకే బిడ్డా జరపైలం ....
తొవ్వొంట పొయ్యేటప్పుడు
జర ఎనుక ముందు చూడు బిడ్డ...
తోడేళ్ళ లాంటి మొగోళ్లు సూపులతోనే
తోడుకొని తినే రకాలను కనిపెట్టి కదులు ...
యాళ్ల గాని యాళ్ల పయనం పెట్టుకోకు
యాటను జేసి గావు పడుతారు...
చీకటి కంటే ముందుగా చేరుకునే
ఆలోచనతో ముందు అడుగెయ్యి బిడ్డా ....
సదువుకునే సరస్వతమ్మ బడాయినా
కొలువుజేషే లక్ష్మమ్మ కార్యాలయమైనా
నీకు నీవే కాపలా ...మాటలతీరు తీయగా ...
చేతలేమో చేదుగా...మనిషిని అసలు నమ్మకు ...
ఆడబిడ్డే కదాని తోడుగా అడుగెయ్యకు...
అద్దెలకమ్మే అమ్మలక్కలకు కొదువలేదు
కమీషన్లకు కక్కుర్తి పడే కాలం ఇది ...
తోడుండి నమ్మిచ్చి నట్టేట ముంచుతారు ....
ఎక్కడ లేదని జెప్పాలె ... ఎక్కడ ఉన్నదని
జెప్పాలె ... ఏమని చెప్పాలి ... ఎలా మొదలు
పెట్టాలె ... ఒకటో తరగతుల మొదలై...
ఓ ఆయ్య చేతిలో పెట్టె క్షణం దాకా ... కంటికి
రెప్పలా నిన్నెట్లా కాపుడుకునేది బిడ్డా ...
అడుగడుగున ఆడ పిల్లంటే అన్యాయమే
చేస్తున్నారు ...బలి తీసుకుంటున్నారు ....
బడి, గుడి, స్వామిజీ, ఉద్యోగస్థలం ,
తొవ్వొంట నడిచినా .. వాహనంలో పయనమైన ...
అంతరిక్షం దాకా పాకింది పాడు లోకం ...
అందుకే చెపుతున్నా బిడ్డా
అడుగడుగున చెరబట్టే రాక్షసులే ...
నువ్వొక అపర కాళీకా దేవివై
అధముల పీచమనుచు....
ఝాన్సీ లక్ష్మీభాయివై ఎదురు
తిరిగి నీ దమ్ము చూపించు ...
రాణీ రుద్రమవై కత్తికొక్క కండగా
నరుకు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment