Wednesday, May 10, 2023

ఆగని అరాచకం 09-11-2022 శీర్షిక : అధికార పూనకం ...

 ఆగని అరాచకం 

09-11-2022
శీర్షిక : అధికార పూనకం  ... 


జీవరాశిలోనే మిన్నంటూ 
మానవాళి విర్ర వీగుడే... కానీ 
నిజానికి అధముడనే సాక్ష్యాలు 
వేలు ... లక్షలు ... కోకొల్లలు .... 

ప్రకృతిలో పుట్టి పెరిగినా 
పట్టుబట్టని పరులకిచ్చే విధం ... 
ఏ జీవికి ఇంతగా లేని వింత జబ్బు 
అతి స్వార్ధము అత్యాశ పేరాశ .... 

నందనందనమైన అవనిమాతను 
ఇంధనాలు ధాతువులు గ్యాస్ పేరున 
కుళ్ళపొడుస్తూ గుల్లబారుస్తూ 
పర్యావరణాన్ని చెరబడుతున్న విధం ... 

మరకతమై శోభిస్తున్న మహీతలాన్ని  
చెట్లు గుట్టలు నరికేస్తూ మోడువార్చి ... 
ఇసుకను సైతం విడవకుండా 
సెలయేళ్ళను ఎండబెడుతున్న వైనం ... 

మడుము బంగారం కన్నా 
మాసమెత్తు హుకూం గొప్పన్నట్టు 
అధికారం పూనిన ఆంబోతుల్లా 
వ్యవహరిస్తున్న మానవ నైజం .... 

No comments:

Post a Comment