ఆనంద దీపం
తేది : 06-11-2022
శీర్షిక : మణిదీపం
మానవాళి గుండెలు
ఆత్మీయత చెమ్మలు
మనసుతో స్పృశియించి ..
మమతలనే నింపుదాం ...
//మానవాళి//
మణిదీపంలా వెలిగించి
లోగిళ్ళను కదిలిద్దాం ....
మనమంతా కలిసిమెలిసి
మరువంలా జీవిద్దాం ....
మానవాళి గుండెలు
ఆత్మీయత చెమ్మలు
అవినీతి బాటలను
అంతం చేసుకుంటూ
నీతి నిజాయితీలను
తైలాలుగా మార్చుదాం…
కుళ్ళు ముళ్ల బాటలను
కూలదోసుకుంటూనే
కుసుమ పరిమళాలనే
వత్తులుగా కూర్చుకుందాం ...
మానవాళి గుండెలు
ఆత్మీయత చెమ్మలు
తిలా పాపములన్నీ
తలా ఇంతంటుంటే
ప్రజా సంక్షేమాల పద్దులను
పకడ్బందీగ వ్యయం చేద్దాం...
అధర్మాల చీడలను
అనితరంగ చెండాడి
ధర్మపు జ్యోతులను
దరికి చేర్చుకుందాం ....
మానవాళి గుండెలు
ఆత్మీయత చెమ్మలు
అసత్యాల నీడలను
అంటకాగాకుండానే
సత్యపు కిరణాలను
ప్రసరింప చేద్దాము ...
ఆనందపు దీపాలను
ఆదరించి మనమంతా
విశ్వవీథి గగనాన
వినమ్రంగ చాటుదాం …
మానవాళి గుండెలు
ఆత్మీయత చెమ్మలు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment