Wednesday, May 10, 2023

కవన రవళి 06-11-2022 గజల్ - కరినగరూ

 కవన రవళి 

06-11-2022
గజల్   
6/6/6/6

తెలుగునకే తొలిగడపగ  
నిలిచెనుగా  కరినగరూ  
శాతవాహన రాజధాని
విరిసెనుగా  కరినగరూ  

కురిక్యాల శాసనాల 
వెయ్యేండ్ల భాషగాను 
ప్రాచీనత పట్టంతో 
వెలిసెనుగా కరినగరూ  

నల్లవజ్ర నిలువలతో 
ఎల్లెడలా ప్రాచుర్యము 
జిలుగులతో వెలుగురేఖ 
నింపెనుగా  కరినగరూ  

సుందరమే వెండినగిషి 
సుతారమై ఫిలిగ్రికళ 
ప్రపంచాన ప్రసిద్ధమై 
గాంచెనుగా  కరినగరూ  

తెలుగుభాష దిగంతాలు 
రారాజుగ చేర్చేకద
విశ్వంభర సినారెగా 
నిలిచెనుగా  కరినగరూ  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment