కవన రవళి -
అంశం : మనిషి - సమాజం
తేది : 04-11-2022
శీర్షిక : అవినాభావం ...
జీవరాశిలో మానవాళి ఉన్నతం
ఉత్తమ జన్మకు ఉభయులు మూలం
తప్పక మనము తలుచుట భావ్యం
మాతృదేవో భవ .. పితృదేవోభవ...
సన్మార్గమునకు జ్ఞానమార్గం
విజ్ఞానం వేవేకం వివేచనం ...
ఎందరెందరో మార్గనిర్దేశకులు
వారందరికీ వందనాలు ...గురుభ్యోన్నమః
నిత్యావసరాలకు నిజ దేవాలయం
సుందరమైన సభ్య సమాజమే...
కోట్ల జనాభాకు కొసిరి అందిస్తున్న
జైకిసానుకు జన్మంతా వందనాలు ...
సుబ్బరంగా తిని నిబ్బరంగా నిదురించ...
నిశ్చింతలే ... దేశ ప్రజలందరికి ....
కంచెలందే కన్నోళ్లను కట్టుకున్నోళ్లను
కనిపెంచిన పిల్లల్ని చూసుకుంటున్న
జైజవానుకు నిండా నూరేళ్లు ....
జీవన గమనపు రహదారంతా
ప్రత్యక్షమో ... పరోక్షమో ...
లెక్కలేనంత మంది వద్ద
ఫలితం పొందిన ప్రతి క్షణం
సుఖమయమయ్యే సుందరం ....
నీతి నిజాయితీలను హత్తుకుని
ధర్మం చూపే అడుగుజాడలలో
న్యాయం చెప్పే సూచనలతో
నలుగురు మెచ్చే నడకలతో
సమాజం కోసం మనం ...
మనకోసం సమాజమైనప్పుడే ....
అవినాభావం ...
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment