జీవన తాత్పర్యం
తేది : 04-11-2022
శీర్షిక : చరితార్థం ...
ప్రమేయం లేని పయనమైన పుట్టుక
ఫలానా ముహూర్తం తెలియని చావుల
మధ్యన నిలిచిన మహాత్యం ....
చేసుకునోళ్లకు చేసుకున్నంత
అల్పమైనా అనన్యమైనా అంతా
స్వంతమే ..స్వావలంబనమే ...
అడ్డాలనాడు బిడ్డలమైనా ...
గడ్డాలనాడు కాదనకుండా
మూలలను తడుముకుని
మురిసిపోగలిగే ముచ్చటెంతో హాయి ...
"మాసం" అంత హుకుం దఖలుతో
మనుషులమన్న సంగతే మరిచి
స్వార్ధపు సంచులు తగిలించుకుని
సతతం ఈ జీవితమనుకుంటే
సంతలో జరిగే వింతే మరి ...
సకలప్రాణులకు సంస్థానం ..
వేలజీవరాశుల్లో వేలుపు స్థానం..
మసిలి మెసులుకోవడం ఉన్నతస్థానం ...
తినడం కొరకు జీవించడం కాకుండా
జీవించడం కొరకు తినడం నేర్చుకోవాలి ...
నలుగురిలో నారాయణలా కాకుండా
నలుగురి మేలు కోరి నడచుకుంటూ
చరిత్రలను అవపోశనపట్టి
చరితార్థంగా జీవించగలగడమే
జీవన తాత్పర్యం .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment