Wednesday, May 10, 2023

ప్రత్యేక కవిత ... బుర్రిపాలెం బుల్లోడు 15-11-22

 ప్రత్యేక కవిత ... 

బుర్రిపాలెం బుల్లోడు
15-11-22
 
బుడి బుడి అడుగులేసిన  
బుర్రిపాలెం బుల్లోడు .... 
తేనె మనసుల తెప్పరిల్లిన  
వెండి తెరల దండి దొర... 
 
ఎప్పటికప్పుడు నూతన 
సాంకేతికతల సొబగులద్దుతూ 
తెలుగు సినీ ప్రపంచాన్ని 
విశ్వవీథి గగనాన  నలుబదేండ్లు 
నగారా మోగించాడు ...  

గూడాచారితో  జేగంట కొట్టి 
జేమ్స్ బాండ్ గా జగజ్జేయమానమై 
కౌబాయ్ గా ప్రసిద్ధి చెందిన 
విలువైన రత్నాల వింతల 
పండంటి కాపురాల పొదరిల్లు ... 

పద్మాలయా స్థూడియోస్ 
స్థాపనతో పది మందికి ఉపాధి 
కల్పించినా  ...నవ్యతలలో నాణ్యతలలో 
రాజీ పడని సూపర్ స్టార్ .... 

పలు పురస్కారాలు మొదలుకొని
పద్మభూషణ్  చేరుకున్న 
ప్రజలు మెచ్చిన నటుడు 
నింగికెగిసిన ధృవతార ..... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment