Wednesday, May 10, 2023

నానీలు తేది : 10-11-2022

 నానీలు 

తేది : 10-11-2022

1. కపటత్వం 
మనసు నింపుకుంటే 
కాలకూటమై మనిషిని 
కబళిస్తుంది .... 

2. అధికార దర్పం 
విర్రవీగితే ... 
అంధత్వం 
ఆవరిస్తుంది... 

3. సహజ హక్కులు 
సమాధి చేస్తే .. 
అప్రకటిత యుద్ధం 
ఆవిర్భవిస్తుంది... 

4. మారిపోయే ధర్మాన్నీ 
మనం కాపలాకాస్తే
మర్మమెరిగి మన 
దాపున నిలుస్తుంది .... 

5. గ్రహాల గమనంలో 
గ్రహణం ... 
భ్రమణ పరిభ్రమణంలో 
చిక్కుముడి చిత్రాలు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment