Wednesday, May 10, 2023

చిత్రానికి గేయం 16-10-2022 శీర్షిక : విడువు న్యూనత.

 చిత్రానికి గేయం

16-10-2022
శీర్షిక : విడువు న్యూనత. 

నీకూ నీవే ఎపుడు గొప్ప 
వేరె ఎందుకు ఇకను చెప్ప  

నిన్ను నీవే చూసుకుంటే 
నమ్మలేక  పోతుంటివా 
మనసు బింబమై మాట చెప్పినా 
మర్మమేమిటో మూట విప్పినా
                 // నీకు // 
వట్టి మాటలు కట్టిపెట్టుమా 
వమ్ము కాదని కనిపెట్టుమా  
అపనమ్మకం ఎదిరించుమా 
ఆత్మస్థైర్యం నమ్ముకొనుమా 
                // నీకు // 
తగవు నీకు న్యూనతమ్ములు 
తలువుమా  సామర్థ్యమ్ములు 
తోడు నిలుచును తదాస్తులు 
కూడ వచ్చును గుర్తింపులు 
               // నీకు // 
గమ్యమెరిగి చరించుమా 
గగనమైనా భీతిల్లకుమా 
గమనం నీవెన్నుకొనుమా 
విజయం నీ చెంత నిలుచూ 
              // నీకు // 
జగతి నిన్ను మెచ్చు విధమై
భవిత నువ్వు నిర్మించుమా 
ఉదాహరించే విధముగానూ  
చరితనంతా  తిరగరాయుము ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment